భారత్‌పై సెంచరీలు.. జయసూర్య సరసన డీకాక్
భారత్‌పై అత్యధికంగా 7 ODI సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్వింటన్ డీకాక్ సనత్ జయసూర్య(SL) సరసన అగ్రస్థానంలో నిలిచాడు. డీకాక్ 23 ఇన్నింగ్స్‌ల్లోనే జయసూర్య (85 ఇన్నింగ్స్) కంటే వేగంగా ఈ ఘనత సాధించడం గమనార్హం. ఇక 6 సెంచరీలతో ABD, పాంటింగ్, సంగక్కర రెండో స్థానంలో ఉండగా.. 5 సెంచరీలతో నాథన్ అస్టిల్(NZ), సల్మాన్ బట్(PAK), స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో ఉన్నారు.