VIDEO: టీడీపీలోకి భారీ చేరికలు

KKD: జగ్గంపేట సంజీవి ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ సంఘం సభ్యులు కడితి లాజర్ ఆధ్వర్యంలో సుమారు 26 మత్స్యకార కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. శుక్రవారం రాత్రి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నెహ్రూ సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని లాజర్ తెలిపారు.