భీమవరంలో రూ.25 లక్షల విరాళం

భీమవరంలో రూ.25 లక్షల విరాళం

W.G: భీమవరంలో నిర్మిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల భవన నిర్మాణానికి దాతలు సహకరించడం అభినందనీయమని రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఆనంద ఫౌండేషన్ రూ.25 లక్షలను భవన నిర్మాణానికి ప్రకటించింది. వారి కార్యాలయంలో రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర అధ్యక్షుడికి అందజేశారు. మిగిలిన వాటిని త్వరలో అందిస్తామన్నారు.