VIDEO: కూలిపోయిన వంతెన.. తాత్కాలిక రోడ్డు ఏర్పాటు..

MLG: ములుగు-హన్మకొండ ప్రధాన జాతీయ రహదారి 163పై గల మల్లంపల్లి వంతెన ఇటీవల కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు అక్కడ తాత్కాలిక రోడ్డును ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల రవాణాకు అనుమతి లభించింది. భారీ వాహనాల రాకపోకలకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.