డిజిటల్ అరెస్టులతో రూ.3 వేల కోట్లు స్వాహా.. సుప్రీం సీరియస్
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌లో బాధితులు రూ.3 వేల కోట్లు కోల్పోవడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన బాధితుల్లో అత్యధికంగా వృద్ధులే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఈ సమస్యపై చర్యలు తీసుకోకపోతే ఇది మరింత తీవ్రతరమవుతుందని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కఠిన ఆదేశాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడబోమని తెలిపింది.