నెల్లూరు రూరల్ ప్రజలకు గమనిక
నెల్లూరు రూరల్ మండలం మాదరాజు గూడూరు సచివాలయంలో ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆర్డీవో అనూష చెప్పారు. ఆధార్ లేనివారు, ముఖ్యంగా రిలీఫ్ సెంటర్స్‌లోని ఆధార్ కార్డులేని వారిని అక్కడికి తీసుకువెళ్లి ఆధార్ చేయించాలని అధికారులకు సూచించారు. ఆధార్ కార్డు పొందేందుకు అవసరమైన స్థిర నివాస ధ్రువీకరణ పత్రం MRO వద్ద తీసుకోవచ్చని చెప్పారు.