బాల్య వివాహాలపై ఎంపీ అవగాహన కార్యక్రమం
KRNL: బాల్యం అమూల్యమైన దశ అని, బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక-మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. బాల్య వివాహ విముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా రూరల్(మం) పంచలింగాల గ్రామంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ దురాచారాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని MP కోరారు.