'ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'

'ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'

KMR: అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సాంస్కృతిక సారథి బృంద సభ్యులు ప్రజలకు వివరించారు. బుధవారం భిక్కనూర్‌లో కళాజాత బృందంతో పాటల ద్వారా ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ రమేష్ రావు, సభ్యులు నాగరాజు, కాశీ రామ్, లక్ష్మి నారాయణ, సవిత, శిల్ప, దివ్య, లత, నరేష్, తిరుపతి పాల్గొన్నారు.