VIDEO: భవాని మాత మూర్తి స్థాపనలో భోగ్ బండారు మహోత్సవం

SRD: సిర్గాపూర్ మండలంలోని బిబ్యా నాయక్ తండాలో భవాని మాత ఆలయంలో మూర్తి స్థాపన మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు గిరిజనులు తమ ఆచార సంప్రదాయ పద్ధతిన ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయం ఎదుట హోమం నిర్వహించారు. అనంతరం భోగ్ బండార్ కార్యక్రమాన్ని చేపట్టి, భక్తి గీతాలను ఆలపిస్తూ మంగళహారతి చేశారు.