గంగన్న కుటుంబానికి ఆర్థిక సాయం

విశాఖ: వనుగుమ్మ పంచాయితీ దొమినిపుట్టు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, గృహ సారధి కొర్ర గంగన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న ఆ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు గ్రామానికి చేరుకుని వైస్ ఎంపీపీ శిరగం భాగ్యవతి సమక్షంలో గంగన్న కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.