భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

BDK: పాల్వంచ వర్తక సంఘ భవనం పక్కన రేగా లక్ష్మీ-రవీందర్ దంపతులు గతేడాది నుంచి నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.