మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఎంపీ పరామర్శ
ADB: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.