పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NZB: విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను, పాత వర్నిలో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు.