గ్రంథాలయ చైర్మన్‌గా వడ్డే వెంకట్ నియామకం
సత్యసాయి: ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వడ్డే వెంకట్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వడ్డే వెంకట్ ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్నారు. నూతన చైర్మన్ నియామకం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.