పంట నష్టానికి రైతులకు పరిహారమివ్వాలి: ఎమ్మెల్యే
కర్నూలు జిల్లాలో మోంథా తుఫాను కారణంగా మిరప, పత్తి, కంది, ఉల్లి, టమోటా పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. గురువారం చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి మండలాల్లో పంట నష్టంపై తక్షణ సర్వే నిర్వహించి రైతులకు సహాయం అందించాలని ఆయన కోరారు.