VIDEO: బస్టాండ్‌లో బస్సు అడ్డుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు
కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీస్ బందోబస్తు మధ్య నిజాంసాగర్‌కు వెళ్లే బస్సును బయటకు తీసేందుకు డ్రైవర్ ప్రయత్నించగా, ఆర్టీసీ జేఏసీ, టీఆర్పీ నాయకులు అడ్డుకున్నారు. బస్సు ముందుకు కదలకుండా నిరసన తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.