స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ విద్యార్థుల ధర్నా

స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ విద్యార్థుల ధర్నా

NRML:పెండింగ్‌ స్కాలర్షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు వివేకానంద చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. జిల్లా కన్వీనర్ దినేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ₹8,900 కోట్ల స్కాలర్షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు