భర్త కనిపించడం లేదు.. భార్య ఫిర్యాదు

భర్త కనిపించడం లేదు.. భార్య ఫిర్యాదు

NLR: సంగం మండలానికి చెందిన ఆదిత్య కనిపించడం లేదని ఆయన భార్య సుప్రజ నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరు నెల్లూరులోని అరుణాచలం వీధిలో ఉంటున్నారు. ఆదిత్య సంగంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న దుకాణానికి వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.