వర్షాలకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్
ASR: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో గల బల్లగరువు మల్లంపేట గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన వర్షాలకు కొండవాగు ఉదృతంగా ప్రవహించడంతో చెక్ డ్యాం శిథిలమైంది. శిధిలమైన చెక్ డ్యాం వద్దకు రెండు గ్రామాల రైతులు వెళ్లి పరిశీలించారు. దీంతో చెక్ డ్యాం కిందన సాగు చేస్తున్న వరి పొలాలకు సాగునీరు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.