నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. స్థానిక ఫీడర్ లైన్‌లో మరమ్మతులు కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి నగర్, ఎల్లికల్ రోడ్డు, గాంధీనగర్, రిలయన్స్ మార్ట్, బ్రహ్మంగారి దేవాలయం వంటి ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.