దిగులు చెందుతున్న చీనీ రైతులు

దిగులు చెందుతున్న చీనీ రైతులు

సత్యసాయి: జిల్లాలో చీనీ తోటలకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల నివారణ కోసం ఏడాదికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు. పెట్టుబడి కంటే రాబడి తక్కువగా ఉండటంతో ఏడాదికి రూ.3 నుంచి 4 లక్షల వరకు నష్టం వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 14,950 హెక్టార్లలో చీనీ పంట సాగులో ఉంది.