భారీ వర్షాల సమయంలో పోలీస్ సూచనలు

GDWL: గద్వాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచనలు గురువారం జారీ చేశారు. వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు నించి వరద ప్రవహిస్తున్నందున వాటి వద్దకు వెళ్లవద్దొన్నారు. నీరు ప్రవహించే రహదారులు దాటవద్దని ఆయన హెచ్చరించారు. అలాగే, చిత్తడిగా ఉన్న రోడ్లపై వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించారు.