కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధి: మేఘారెడ్డి

WNP: విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం రాజపేట శివారులో రూ.3.50 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వనపర్తి పట్టణ బాలుర రెసిడెన్షియల్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.