ఓంబిర్లాపై మోదీ ప్రశంసలు

ఓంబిర్లాపై మోదీ ప్రశంసలు

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఓం బిర్లా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కొనియాడారు. దిగువ సభ స్పీకర్‌గా రాజ్యాంగాన్ని కాపాడుతున్నారని మెచ్చుకున్నారు. సభలో ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఓం బిర్లాపై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.