తిరుపతిలో భారీగా నకిలీ మద్యం.. వాస్తవం ఇదే!
తిరుపతిలో భారీగా నకిలీ మద్యం లభ్యం అంటూ SMలో వస్తున్న వార్తలపై FACT CHECK స్పందించింది. 'తిరుపతి రూరల్ పాడిపేట ఇందిరమ్మ గృహాల వద్ద చంద్రగిరి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగేష్ రెడ్డి(38) నివాసంలో 34 లీటర్ల అనధికార మద్యం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి కెమికల్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.