అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ ఎంపికలు వాయిదా
సత్యసాయి: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగాల్సిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ జిల్లా స్థాయి ఎంపికలను వాయిదా వేసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఉదయ్ బాస్కర్ తెలిపారు. అక్టోబర్ 30న ధర్మవరం, పెనుకొండ వేదికలలో జరగాల్సిన ఈ ఎంపికలు మొంథా తుఫాన్ ప్రభావంతో వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.