ధర్నాచౌక్‌లో ఈటల రాజేందర్

HYD: వెస్ట్ బెంగాల్‌లో జరిగిన అమానుష ఘటనపై దేశవ్యాప్త బంద్ పాటిస్తున్న డాక్టర్ల ధర్నాకు మద్దతు తెలిపారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ రాష్ట్రంలో జరిగిన అమానుషదాడిని ఖండిస్తున్నాను. ఇలాంటి సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఇంకెప్పుడూ కలుగకూడదని దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నందుకు నా మద్దతు ఉంటుందన్నారు.