ఎగుమతి రంగ కార్మికులకు గుడ్ న్యూస్
కొత్తగా అమలు చేసిన కార్మిక కోడ్‌ల వల్ల ఎగుమతి రంగంలోని కార్మికులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వారు ఇకపై గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతారు. సంవత్సరంలో 180 రోజులు పనిచేసిన తర్వాత వీరికి వార్షిక సెలవులను పొందే అవకాశం కూడా ఉంటుంది. కొత్త కోడ్‌లు సకాలంలో వేతన చెల్లింపును తప్పనిసరి చేసి, అనధికార వేతన కోతలను నిరోధిస్తాయి.