వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టరుగా శేషగిరిరావు

కృష్ణా: గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టరుగా మున్నంగి శేషగిరిరావు (బాబురావు) నియమితులయ్యారు. ఆదివారం బాపులపాడు మండలం H.జంక్షన్‌లో కాకులపాడు ఛానల్ డీసీ ఛైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ నేతృత్వంలో టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు. రైతుల సేవ, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని బాబురావు హామీ ఇచ్చారు.