VIDEO: 'డ్రైనేజీ సౌకర్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం'
ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలోని 2వ వార్డులో డ్రైనేజీ సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో చుట్టు పక్కన నివసిస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.