'రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి'
MLG: రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆత్మ ఛైర్మన్ (ATMA)కర్ల అరుణ సూచించారు. జిల్లాలోని ఏడు మండలాల వ్యవసాయ శాఖా అధికారులతో మంగళవారం ఆమె ఏటూరునాగారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతులకు చేరే విధంగా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు.