VIDEO: ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: ఆలయానికి పోటెత్తిన భక్తులు

JGL: గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి అనుబంధ గ్రామం కొస్నపల్లిలోని కాలభైరవ స్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమావాస్య శుక్రవారం కావడంతో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బూడిద గుమ్మడికాయలతో దీపాలు ముట్టించి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు.