అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ELR: దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ 6వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.