స్మిత్‌పై పగ తీర్చుకున్న పాక్ ప్లేయర్?
PSLలో స్టీవ్ స్మిత్ ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడుతున్నాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో స్మిత్ సింగిల్ కోసం ప్రయత్నించగా, మరో ఓపెనర్ ఫర్హాన్ దానికి నిరాకరించాడు. గతంలో BBLలో బాబర్ సింగిల్‌కు ప్రయత్నించగా స్మిత్ రన్‌కు రాలేదు. దీంతో బాబర్‌కు జరిగిన అవమానానికి ఫర్హాన్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడంటూ SMలో పాక్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.