'హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి'
KNR: కొత్తపల్లిలోని రామాలయంలో హిందూ సమ్మేళన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆధ్వర్యంలో ఈనెల 25న కొత్తపల్లిలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆత్మీయ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.