పేదోడి సొంతింటి కల నిజం చేసేది కాంగ్రెస్: డిప్యూటీ మేయర్

పేదోడి సొంతింటి కల నిజం చేసేది కాంగ్రెస్: డిప్యూటీ మేయర్

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ బండ్ల గేరి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.