ఆరోగ్యానికి వరం.. జామపండు

ఆరోగ్యానికి వరం.. జామపండు

జామపండ్లు మన ఆరోగ్యానికి వరం లాంటిది. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే పండు అంటే చాలా మందికి మొదట గుర్తొచ్చేది జామకాయే. ఇందులో విటమిన్ C, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ముఖ్యమైన పోషకాలు తగినంతగా ఉంటాయి. ఫైబర్ ఉండటంతో కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలతో పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదే.