ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

ATP: రాయదుర్గం పట్టణ శివారులోని బళ్లారిరోడ్డులో ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం రాయదుర్గం నుంచి బళ్లారి వైపు ప్రయాణికులతో ఆటో వెళ్తుతుంది. నరసింహ స్వామి ఆర్చివద్ద హిజ్రాలు ఉండటంతో వారు డబ్బు అడగతారేమోనని డ్రైవర్ వేగంగా వెళ్లాడు. అదే సమయంలో బళ్లారి వైపునుంచి ప్రైవేట్ బస్ రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.