బోథ్ మార్కెట్ యార్డులో మెగా వైద్య శిబిరం
ADB: బోథ్ మార్కెట్ యార్డులో మంగళవారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, మార్కెట్‌కు వచ్చే వారు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందజేసేందుకు తాను ఎల్లప్పుడు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.