'ఢిల్లీ, ముంబై, బెంగళూరు కంటే HYDనే బెస్ట్'
ముంబై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల కంటే HYD బెస్ట్ నగరం అని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చేసిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. కెవిన్ సామ్ అనే వ్యక్తి ఇన్‌స్టాలో.. 'నేను HYDకి వచ్చి 4 గంటలు మాత్రమే అయ్యింది. కానీ ఇప్పటికే సిటీ నన్ను ఆకట్టుకుంది. నేను ఢిల్లీ వాసిని ముంబై, బెంగళూరుకి కూడా వెళ్లాను.. కానీ HYDకి పోటీనే లేదు' అని అన్నాడు.