విద్యార్థులను చదివించిన కలెక్టర్
SRPT: పెన్ పహాడ్ మండలం అనంతారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి ఒక్కరూ ప్రతి సబ్జెక్టులో 70 శాతం మార్కులు సాధించేలా విద్యార్థులు చదవాలన్నారు. విద్యార్థులను తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులను చదివించి నోట్ బుక్స్ పరిశీలించారు. జీవితంలో పదవ తరగతి తొలి మెట్టు అన్నారు.