కూచిపూడి-అయ్యింకి రోడ్డుపై గుంతలు

కృష్ణా: కూచిపూడి నుంచి అయ్యింకి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమై దారుణంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా ద్విచక్ర వాహనదారులకు, ఆటోలకు, బస్సులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. గుంతల కారణంగా బైకులు స్కిడ్ అవుతూ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు.