VIDEO: వైభవంగా యాదగిరి శ్రీవారి నిత్య కళ్యాణం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిత్య ఆర్జిత సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం వైభవంగా అర్చకులు నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన నరసింహ హోమం, అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.