'గర్భిణీలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి'
NGKL: గర్భిణీలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచి సమాచారం అందించాలని, గర్భిణీ మహిళలు నెల వారీ ఆరోగ్య పరీక్షలకు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.