తీవ్ర చలితో వణికిపోతున్న ప్రజలు
HYD: నగర ప్రజలు ఈ NOVలోనే తీవ్ర చలితో గజగజ వణికిపోతున్నారు. సాధరణంగా డిసెంబర్ నెలాఖరు, జనవరి ఆరంభంలో కొద్ది రోజులపాటు 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే పడిపోయాయి. ఈసారి ఎక్కువ వర్షాలు, తుఫాన్లు రావడమే కారణమని వాతావరణ శాఖ డైరెక్టర్ డా. నాగరత్నం తెలిపారు. ఈరోజు నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.