VIDEO: గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

VIDEO: గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

MNCL: చెన్నూర్ గురుకుల పాఠశాల హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని శ్రీఇందు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఉపాధ్యాయుల వేధింపుల కారణంగా మనస్తాపం చెంది బాలిక పురుగు మందు తాగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధినిని వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.