ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: మక్తల్లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ప్రసూతి గది, స్కానింగ్, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, జనరల్ వార్డు, డ్రగ్స్ స్టోర్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు.