గ్రూప్-1 పరీక్షలపై కలెక్టర్ కీలక ఆదేశాలు

HYD: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 21 నుండి 27 వరకు జిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి అన్ని పరీక్షా కేంద్రాలకు పోలీసు బందోబస్తు, పర్యవేక్షణ మధ్య రూట్స్ వారీగా ప్రశ్నాపత్రాలు చేరుకోవాలన్నారు.