VIDEO: ఘనంగా టీచర్స్ డే వేడుకలు

కృష్ణా: నందివాడ మండలం జనార్ధనపురం గ్రామంలో టీచర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పే పాటలు చక్కగా విని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని స్కూల్ అధ్యక్షుడు మరియదాసు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు అంజిరెడ్డి, గ్రామ సొసైటీ శివ నారాయణ పాల్గొన్నారు.