భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది: జైశంకర్
ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరుచుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. 'భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదు. గత 80 ఏళ్లుగా ప్రపంచం చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, భారత్-రష్యాల మధ్య బంధం స్థిరంగా కొనసాగుతుంది. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి' అని పేర్కొన్నారు.